25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మాంస ప్రియుల కంటే మృగాలే నయం

Must read

📰 Generate e-Paper Clip

  • మనుషులు చచ్చిన జంతు మాంసం తింటే.. మృగాలు ప్రాణం ఉండగా తింటాయి..
  • రానురాను మాంస ప్రియులు మనుషుల శవాలను తినేటట్టున్నారన్న ఎఫ్. బి పోస్ట్ వివాదం

కమ్మర్ పల్లి, బతుకమ్మ : స్వాతంత్ర భారతంలో అందరికీ అన్ని రకాల హక్కులు ఉంటాయి.అందులో భావ ప్రకటన హక్కు కుడా ఉంటుంది దానికి తోడు భాద్యత ఉంటుందన్న విషయం కొందరు మరిచిపోతారు.ఆ హక్కును దృష్టిలో పెట్టుకొని ఇంకొకరికి ఇబ్బంది కలుగకుండా మన భావ ప్రకటన చేస్తే బాగుంటుంది. హక్కు ఉందని మనం మాట్లాడితే అహక్కు వినియోగం హద్దుదాటితే పడే శిక్ష పెద్దగానే ఉంటుంది.అసలు సంఘటన వివరాల్లోకి వెళ్తే కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ప్రబుద్ధుడు,శాఖాహరి అనుకుంట మాంస ప్రియులను ఉద్దేశించి పేస్ బుక్ లో చెసిన పోస్ట్ వివాధానికి దారి తీసింది. మండల కేంద్రానికి చెందిన ఓ ప్రబుద్ధుడు మాంస ఆహారం విషయంలో మనుషులు చచ్చిన చేపలు, కోళ్లు తింటున్నారు. కానీ సింహం,పులి లాంటి మృగాలే చావక ముందు వేటాడి తింటాయాని,వేటాడిన జంతువు శ్వాస విడగానే తినకుండా వదిలేస్తుందని పోస్ట్ చేసాడు. అంతటితో ఆగకుండా రాను రాను చనిపోయిన మనుషుల శవాలను కూడా తింటారేమో మనుషులు ఛీ.. ఛీ.. ఛీ అని తన పేస్ బుక్ లో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. తన భావ ప్రకటన తనకు బాగానే ఉన్న ఈ పోస్ట్ ఇటు మాంస ప్రియులను, అటు మాంస విక్రయధారులను హర్ట్ చెసింది. ఇంకేముంది ప్రబుద్ధుని పోస్ట్ కాస్త మండల కేంద్రంలో వివాదంగా మారింది . ఈ వివాదం ముదిరి పాకనా పడక ముందే, పోస్ట్ చేసిన ప్రబుద్దునికి తగిన గుణపాఠం చెప్పక ముందే జరిగే పరిణామంను పసికట్టిన వీడీసీ ప్రెసిడెంట్ , ఎస్సై లు రంగ ప్రవేశం చేసి వారి పెద్దలను పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. ధీంతో వివాదం సద్దుమణిగినట్లు తెలిసింది.

More articles

Latest article