26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బీసీటీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాడవేడి వినోద్ కుమార్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బీసీటీయూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం రాష్ర్ట సలహాదారు రమణస్వామి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్ గోపాలకృష్ణ,  వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా కె. రవికుమార్, కె. రామకృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా కే బాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఏ మోహన్, ఉపాధ్యక్షులుగా యు విజయ్ కుమార్, ఎం మహేందర్, డి శ్యాంప్రసాద్, జె శ్రీనివాస్,  మహిళా ఉపాధ్యక్షురాలిగా బి ప్రతిభ, జి స్వప్న, కోశాధికారిగా డి. రాజు, కార్యదర్శులుగా పి చంద్రశేఖర్, టి. వినోద్ కుమార్, ఎం మాణిక్యం,  ఎస్ సతీశ్ కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ననుగొండ విజయలక్ష్మి, గౌరవ సలహాదారులుగా కొట్టూరు రమేశ్, వై సత్యనారాయణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మేడిదాల ప్రవీణ్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అంబటి నర్సయ్య, వంగ శ్రీహరి,  శ్రీనివాసరాజు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా బి కళ్యాణి, ఎ. సబిత, రాష్ట్ర కార్యదర్షులుగా జి కృష్ణాజి,  ఎం. వేణుగోపాల్,  రాష్ట్ర గౌరవ సలహాదారులుగా టి రమణ స్వామి, ఏ శంకర్, డి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు.

ధన్యవాదాలు తెలిపిన మాడవేడి

తనను మరోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న జిల్లా కార్యవర్గానికి అధ్యక్షుడు మాడవేడి వినోద్ ధన్యవాదాలు తెలిపారు. నూతన పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, జనాభా దామాషా ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, నాలుగు పెండింగ్ డిఏ లను విడుదల చేయాలని, గురుకుల ఆదర్శ పాఠశాల, కేజీబీవీల సమస్యలను పరిష్కరించాలని, బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Election of new executive committee of BCTU

More articles

Latest article