26.2 C
Hyderabad
Monday, August 3, 2026

టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన  పి. అశోక్ కుమార్ కు టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపి శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ  సందర్భంగా  జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు. మన జిల్లావాసి మనకు డీఈఓ గా రావడం అభినందనీయమని అన్నారు. కుల గణన విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి. సత్యానంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ. రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి. సిరాజుద్దీన్, జిల్లా కోశాధికారి ఎం. మల్లేష్, జిల్లా కార్యదర్శులు జి.గంగాధర్, ఎన్. రాజారామ్, వి. సాయన్న, జి. ఆనందం, డి. బాబులు, జిల్లా కమిటీ సభ్యులు ఈ. శ్రీనివాస్, ఎం. బాజన్న, ఎం. రవీందర్, సోన్ పేట్ గంగాధర్ పాల్గొన్నారు.

More articles

Latest article