28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సమగ్ర కుటుంబ సర్వే చేయలేం

Must read

📰 Generate e-Paper Clip

. చేతులెత్తేసిన మెప్మా రీసోర్స్ పర్సన్స్

 . 29 మందిపై చర్యలకు కమిషనర్ సిఫారసు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే తాము చేయలేమని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలోని మెప్మాలో విధులు నిర్వర్తిస్తున్న 29 మంది రీసోర్స్ పర్సన్  లు చేతులేత్తేశారు. నగర పాలక సంస్థ పరిధిలో 200 మంది ఆర్పీలు ఉండగా, 29 మంది తాము సర్వే విధులు నిర్వర్తించలేమంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఇంటింటికి తిరుగుతూ సర్వే ఫారాలను నింపడం తమతో కాదని చెప్పేశారు. దీనిపై నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ సర్వేలో పాల్గొనని 29 మంది ఆర్ పీలపై చర్యలు తీసుకోవాలని మెప్మా పిడి రాజేందర్ కు ఆయన లేఖ రాశారు. మెప్మా సిబ్బందిపై పీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే దానిపై అనే చర్చ జరుగుతోంది.

 

More articles

Latest article