24 C
Hyderabad
Sunday, August 2, 2026

అమరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు

Must read

📰 Generate e-Paper Clip

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూర్ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్

బతుకమ్మ, మాక్లూర్ : పీడిత ప్రజల విముక్తి కోసం, సమాజ మార్పు కోసం పోరాడిన  అమరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూర్ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు.  సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం మాణిక్ బండార్ చెక్క  వద్ద అమరవీరుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూర్ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడారు.  భూమి కోసం, భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం జరిగిన భారత విప్లవవోద్యమంలో అనైక మంది అగ్రశ్రేణి నాయకులు అమరులయ్యారని అన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయక విప్లవ వోద్యమ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు. సరిగ్గా ఈ కాలంలోనే 1968 నవంబర్ 4న కామ్రేడ్ మావో ఆలోచన విధానాల వెలుగులో శ్రీకాకుళ గిరిజన రైతంగ సాయుధ పోరాటం ప్రారంభం మైందని అన్నారు. ఈ పోరాటంతో  గోదావరి లోయలో విప్లవవోద్యమ నిర్మాణానికి కృషి ప్రారంభమైందని  అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గత 50 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసి లక్షల ఎకరాల పోడు భూములు సాధించి గిరిజనులకు పెద ప్రజలు కు పంచిపెట్టిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలనుపై రాజిలేని పోరాటాలతో ప్రతిఘటించాలి అని పిలుపునిచ్చారు. సుదీర్ఘ కాలంగా కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి రూపొందించిన ప్రతిఘటన పోరాటంలో నూతన ప్రజాస్వామ్య విప్లవం వర్ధిల్లాలని పోరాటంలో ప్రజలందరూ భాగస్వామం కావాలని ఆయన అన్నారు. ఈ  కార్యక్రమంలో నాయకులు అబ్బయ్య రవి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article