24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇద్దరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో అధిక వడ్డీలు వసూలు చేస్తు ఇద్దరి  మరణానికి కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,  పౌర సమాజం వాళ్ళ చర్యలను తీవ్రంగా ఖండించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య రాష్ట్రప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.  నగరంలోని కోటగల్లిలో గల  నీలం రామచంద్రయ్య భవన్ లో శుక్రవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ఇద్దరు గోదావరి లో దూకి ఆత్మహత్య ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఫైనాన్స్,మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జోరుగా జరుగుతుందని, నిరుద్యోగ యువతను ఉద్యోగాలలో చేర్చుకొని వారి చేత డబ్బులు వసూలు చేపిస్తూ ఇవ్వని కుటుంబాలపై హింస దౌర్జన్యం అవహేళన చేయటం వలన అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఒక ఫైనాన్స్ వ్యాపారి తన బంధువులకె డబ్బులు ఇచ్చి వ్యాపారం నడవట్లేదు అని కొద్దిరోజులు ఆగమంటే నువ్వు డబ్బులు కట్టకపోతే నీ కిడ్నీలు అమ్ముకొని మరి డబ్బులు తీసుకుంటానని బెదిరించిన ఘటనలు జిల్లా ఎన్నో ఉన్నాయని అన్నారు. వడ్డీ వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, న్యూడెమోక్రసీ నగర నాయకులు జెల్ల మురళీ,  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article