ఇద్దరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో అధిక వడ్డీలు వసూలు చేస్తు ఇద్దరి  మరణానికి కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,  పౌర సమాజం వాళ్ళ చర్యలను తీవ్రంగా ఖండించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య రాష్ట్రప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.  నగరంలోని కోటగల్లిలో గల  నీలం రామచంద్రయ్య భవన్ లో శుక్రవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా...