నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని కోర్టు వద్ద ప్రారంభించిన న్యాయమూర్తి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితుడు ఆశీర్వచనాలు అందజేశారు.
