29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పాఠశాాలకు సౌండ్ బాక్స్ వితరణ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు కొండగట్టు ఆలయ పూజారి జై క్రిష్ణా సోమవారం రూ. 30 వేల  విలువ చేసే సౌండ్ బాక్స్ లను స్కూల్ ప్రదానోపాధ్యాయునికి అందజేశారు. ఈ సందర్భంగా పూజారి జైక్రిష్ణ కు ఉపాధ్యాయ బృందం ధన్యవాదాలు తెలిపారు. స్కూల్ అభివృద్ధి కొరకు తనవంతుగా సహాయం చేసిన పూజరికి నాలేశ్వర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు, నాలేశ్వర్ మాజీ సర్పంచ్ సరిన్, వీడిసి సభ్యులు సురేష్, స్వామి, రాజేశ్వర్, మోహన్, మరియు పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Distribution of sound box to schools

More articles

Latest article