సోషల్ మిడియాలో పోస్టుల ఫలితం
మోర్తాడ్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రానికి చెందిన బద్దం అశోక్ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను కించ పరిచే విధంగా ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టినందుకు గాను ఆంద్ర పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన కార్యకర్తలు కోందరు బద్ధం అశోక్ రెడ్డి సోషల్ మిడియాలో పెట్టిన పోస్టులపై పిర్యాదు చేయడంతో పోలిసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. వివరాలు తెలియాల్సి ఉంది.
