కామారెడ్డి, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పక్కాగా ఉండాలని, చెత్త లేకుండా ప్యాడీ క్లీన్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండలం పోసాని పేట్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యాన్ని శుభ్ర పరచాలని(ప్యాడీ క్లీన్) మానిటరింగ్ అధికారిని ఆదేశించారు. అలాగే 40 కిలోల 600 గ్రాముల ధాన్యాన్ని బస్తాల్లో నింపి పక్కాగా తూకం వేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు చేయాలని, వర్షానికి ధాన్యం తడవకుండా టార్పలిన్ లు సిద్ధం ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి రామ్మోహన్, మానిటరింగ్ అధికారి యూ సాయిలు తదితరులున్నారు.
