. . . ఇందల్వాయి పిఎసీఎస్ కోనుగోలు కేంద్రంను తనిఖీ చేసిన కలెక్టర్
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార కొనుగోలు సకేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,అదనపు కలెక్టర్ లు సందర్శించారు,నిల్వ ఉన్న వరి ధాన్యం కుప్పలను చూసి ఎప్పటివరకు పూర్తిస్థాయిలో మిల్లులకు పంపుతారని సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలలో కాంటలు ప్రారంభం కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.కొనుగోలు కేంద్రాలలో నిల్వవున్న వరి ధాన్యన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలు పడితే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ సి ఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి, తహసిల్దార్ వెంకట్రావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్,ఎన్ డి సి సి బి డైరెక్టర్ ఆనంద్, సీఈవో రతన్, మాజీ వైస్ ఎంపీపీ ముత్తన్న, పిఎసిఎస్ మాజీ చైర్మన్ గోపాల్,కిషన్, రవి, విడిసి అధ్యక్షులు జితేందర్,సిబ్బంది రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

