27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం ను కలిసిన మాజీ ఎంపీపీ

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ స్టేట్ సీ. ఎం రేవంత్ రెడ్డి ని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీపీ బాల్కొండ నియోజకవర్గం తో పాటు భీమ్ గల్ మున్సిపల్ అభివృద్ధి కి సహకరించాలని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ని కోరారు. నియోజకవర్గం లో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్లారు . ఎన్నికల కొరకు హడావిడి గా పనులను మొదలు పెట్టి మధ్యలో నిలిపి వేసిన పనులను ప్రజల సౌకర్యంను దృష్టిలో ఉంచుకుని పూర్తి చేయవలసిందిగా ఈ సందర్బంగా నాయకులు ముత్యాల సునిల్ కుమార్ సీ. ఎం ను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి బాల్కొండ నియోజకవర్గం లో అభివృద్ధి కి అన్ని విధాలుగా సహకరించాలని అధికారులకు ఆదేశించినట్లు నాయకులు తెలిపారు.నియోజకవర్గం అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తానని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కి ముత్యాల సునిల్ కుమార్ తో పాటు కన్నె సురేందర్ ధన్యవాదములు తెలిపారు. వీరి వెంట నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు.

More articles

Latest article