26.2 C
Hyderabad
Monday, August 3, 2026

5న పెన్షనర్ల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్లు పోరుబాట పట్టనున్నారు. ఈ 5వ తేదీన ఉదయం 10గంటల నుంచి ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టంలో  అత్యధిక డీఏలు  పెండింగ్  లో ఉన్నాయని, రాష్ర్ట ప్రభుత్వం ఒకే ఒక్క డీఏను విడుదల చేసి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలు చేయాలని, కమిటెడ్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ ను 12 ఏళ్లకు కుదించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న వైద్య బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని తదితర డిమాండ్ లతో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నర్రా రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు లావు వీరయ్య, కోశాధికారి ఈవిల్ నారాయణ, నాయకులు నర్రా రామారావు, ప్రసాద్, రాధాకిషన్, సిర్ప లింగయ్య, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ,  సాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article