5న పెన్షనర్ల ధర్నా

నిజామాబాద్, బతుకమ్మ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్లు పోరుబాట పట్టనున్నారు. ఈ 5వ తేదీన ఉదయం 10గంటల నుంచి ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టంలో  అత్యధిక డీఏలు  పెండింగ్  లో ఉన్నాయని, రాష్ర్ట ప్రభుత్వం ఒకే ఒక్క డీఏను విడుదల చేసి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేట్,...