24.1 C
Hyderabad
Monday, August 3, 2026

స్టేట్ లెవల్ జూడో లో జిల్లాకు మూడోస్థానం

Must read

📰 Generate e-Paper Clip

  • అబ్జర్వర్ అనిత నేతృత్వం లో రెండో సారి జిల్లా జట్ల గెలుపు
  • అబ్జర్వర్ కు ఘన సన్మానం

భీమ్ గల్, బతుకమ్మ : స్టేట్ లెవల్ జూడో క్రీడాలో నిజామాబాద్ జిల్లా అండర్ 17జట్టు మూడవ స్థానంలో నిలిచింది. జిల్లాలోని జగిర్యాల గ్రామానికి చెందిన గడల అనిత స్టేట్ అబ్జర్వర్ గా నియమించిన అనంతరం స్టేట్ లెవల్ జూడోలో జిల్లా కు రెండు సార్లు విజయం వరించింది.ఇందులో భాగంగా ఇటీవలే అనిత అబ్జర్వర్ గా ఆమె ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగిన ఎస్ జీ ఎఫ్ అండర్ 14టోర్నమెంట్ లో జిల్లా జట్టుకు రెండవ బహుమతి వచ్చింది . అదే క్రమంలో ఈ సారి అండర్ 17 జిల్లా జట్టు తో ఈనెల 29 న వరంగల్ లో నిర్వహించిన 68వ ఎస్ జీ ఎఫ్ టోర్నమెంట్ లో జిల్లాకు మూఢవ స్థానంను తెచ్చి పెట్టింది.ఈ సందర్బంగా అబ్జర్వర్ గడల అనితను ఎస్ జీ ఎఫ్ స్టేట్ టీం ఘనంగా సన్మానించింది.

More articles

Latest article