24.7 C
Hyderabad
Monday, August 3, 2026

అభివృద్ధి పనులు నాణ్యతతో త్వరతగతిన పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

కాంట్రాక్టర్లను ఆదేశించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని 27వ డివిజన్ ఆనంద్ నగర్, 9వ డివిజన్ ఓల్డ్ నాగారం, 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ నగర మేయర్ నీతు& కిరణ్ పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు జనరల్ ఫండ్ ధ్వరా ప్రతి డివిజన్ కు పదిలక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. అర్బన్ నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు తగిన నిధులు మంజూరు చేయాలనీ ఇంచార్జ్ మంత్రి జూపల్లికి ,రాష్ట్ర ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. నగర అభివృద్ధికి 100 కోట్ల నిధులు విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గెలిచి పదినెలలు గడుస్తున్న ఎమ్మెల్యేగా తనకు రావలిసిన సొంత నిధులు కూడా రాలేదని అన్నారు. వెంటనే వాటిని కూడా విడుదల చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, సాయి వర్ధన్, బుర్గుల ఇందిర &వినోద్ మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Development works should be completed promptly with quality

More articles

Latest article