నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా సమీపంలోని ఎస్.సి.బాలుర వసతి గృహాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, ఎస్.సి.సంక్షేమ అధికారిని రజిత పాల్గొన్నారు.

