25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నవంబర్ 5న ఇందూర్ యువత సర్వసభ్య సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నవంబర్ 5 న ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం నగరంలోని దుబ్బ లో గల బంగారు మైసమ్మ  ఆలయ ప్రాంగణం నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. సేవా కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు, మనశ్శాంతి కోవెల ఆశ్రమ ట్రస్ట్ కి సంబంధించి కమిటి ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు చిట్టిమిల హరిప్రసాద్, మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ఈ సమావేశంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యవర్గం మరియు కార్యవర్గ సభ్యులందరూ పాల్గొనలన్నారు.  సంస్థ సేవా కార్యక్రమాల్లో యువత స్వచ్చందంగా పాల్గోనలనుకునేవారు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  సంస్థ ప్రతినిధులు దారం గంగాధర్,చందా జగన్ మోహన్, పట్టేవార్ శ్రీనివాస్, రాచర్ల రాజేష్ శర్మ , రాజు , తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article