28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బెటాలియన్ కానిస్టేబుళ్ల న్యాయమైన డిమాండ్ లను పరిగణనలోకి తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కానిస్టేబుళ్లు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడడం అన్యాయమని అన్నారు. కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ను ఖండిస్తున్నామన్నారు. మొత్తం 49 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు.

 

More articles

Latest article