
ఎల్లారెడ్డి, బతుకమ్మ: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసులు రక్తదానం చేశారు. ఎల్లారెడ్డిలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాలులో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పోలీసులతోపాటు స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం చేసిన పోలీసు అధికారులను రెడ్ క్రాస్ ప్రతినిధి సంజీవరెడ్డి సన్మానించారు. యువతకు బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేశ్, నాగిరెడ్డిపేట్ ఎస్సై మల్లారెడ్డి, లింగంపేట్ ఎస్సై అరుణ్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ బాడీ మెంబర్ సంజీవరెడ్డి, లింగంపేట్ మండల అధ్యక్షుడు బొల్లు శ్రీకాంత్, కృష్ణారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్ రెడ్డి, కానిస్టేబుళ్లు ప్రేమ్ సింగ్, ఆంజనేయులు, సంజీవులు, యువకులు పాల్గొన్నారు.
