ఎల్లారెడ్డిలో పోలీసుల రక్తదానం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసులు రక్తదానం చేశారు. ఎల్లారెడ్డిలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాలులో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పోలీసులతోపాటు స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం చేసిన పోలీసు అధికారులను రెడ్ క్రాస్ ప్రతినిధి సంజీవరెడ్డి సన్మానించారు. యువతకు...