23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

బిఆర్ఎస్ సీనియర్ నేత శ్రీహరి 9వ వర్ధంతి

Must read

📰 Generate e-Paper Clip

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ దురంధరులు శ్రీహరి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ఆత్మీయుల మధ్య మంగళవారం నిర్వహించారు. అనంతరం తమ వ్యవసాయ క్షేత్రంలోని శ్రీహరి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీహరి అంతటి గొప్ప నాయకుడు చనిపోయి 9 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికి మన మధ్యనే తిరుగుతూ మన తోటే ఉండి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుందని వారన్నారు. జుక్కల్ నియోజకవర్గం లో శ్రీహరి పార్టీ కోసం చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదని బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త గుర్తు చేశారు. రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వంటి ముఖ్య మంత్రుల స్థాయి లెవల్లో రాజకీయ ప్రస్తావనలు జరిపిన ఆయన సామాన్య కార్యకర్తలని కూడా పేరు పెట్టి పిలుస్తూ ప్రతి ఒక్కరిని చేరదీసిన విధానం ఆత్మీయత అనన్య సామాన్యమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు కుమారులు నాల్చార్ రాజు, నాల్చార్ బాలాజీ, కూతురు సుజాత, అల్లుడు శ్రీనివాస్ తో పాటు అభిమానులు, ఆత్మీయులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article