26.2 C
Hyderabad

8గేట్లు ఎత్తి నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 34,654 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. దీంతో  ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లని ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటి విడుదల గోదావరిలోకి కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు కాలువల ద్వారా కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1091.00 అడుగులు, 80.501 టిఎంసిల నీరు ఉంది.

More articles

Latest article