24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ :

 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని బ్లూమింగ్ బడ్స్ హైస్కూల్ లో సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్వర్ణమారి హాజరయ్యారు. ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం భారత రాజ్యాంగ రచయిత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఉద్దేశించి విద్యార్థిని, విద్యార్థులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫయాజ్ అలీ, ఇంచార్జ్ శ్రీధర్ గౌడ్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందం, విద్యార్ధిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article