బతుకమ్మ, జుక్కల్: జుక్క మండలంలోని సావర్ గాం గ్రామం వద్ద కౌలాస్ నాలా ప్రాజెక్టు 7 గేట్లు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ శివకుమార్ పేర్కొన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 458 మీటర్లు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 457.65 మీటర్ల వరద నీరు వచ్చి చేరిందని పేర్కొన్నారు. 7 గేట్లు ఎత్తివేత నీటిని విడుదల చేశారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో22820 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ 7 గేట్లు విడుదల చేశామని ప్రాజెక్టు ఏఈ శివకుమార్ పేర్కొన్నారు. మొత్తం ఆన్ ప్లో 36153 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని పేర్కొన్నారు.
