23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజావాణికి 64 ఫిర్యాదులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ట్రైనీ కలెక్టర్ తో పాటు మెప్మా పీ.డీ రాజేందర్, ఇంచార్జ్ డీపీఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏ.సీ.పీ కిరణ్ కుమార్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

64 complaints to Prajavani

More articles

Latest article