23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు 35 దరఖాస్తులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : మద్యం షాప్ ల దారాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాలకు జిల్లాలో 102 వైన్ షాప్ లకు గాను 24 షాప్ లకు 35 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను 11 షాప్ లకు 18 దరఖాస్తులు వచ్చాయన్నారు. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు గాను 4 షాప్ లకు 5 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆర్మూర్ స్టేషన్  పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు గాను 4 షాప్ లకు 5 దరఖాస్తులు వచ్చాయన్నారు. భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను 3షాప్ లకు 4 దరఖాస్తులు వచ్చాయన్నారు. మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాప్లకు గాను 2 షాప్ లకు 3 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

More articles

Latest article