26.3 C
Hyderabad
Monday, August 3, 2026

గ్రామ పంచాయతీలకు 304.. వార్డుమెంబర్లకు 382 నామినేషన్లు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో రెండవ రోజు సర్పంచ్ పదవులకు నామినేషన్ల దాఖలు జోరందుకుంది. మొదటి విడతలో భాగంగా బోధన్ డివిజన్ లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైన విషయం తెల్సిందే. రెండవరోజు శుక్రవారం గ్రామ పంచాయితీలకు 304, వార్డుల సభ్యుల పోస్టులకు 382 నామినేషన్లు దాఖలయ్యాయి. బోధన్ డివిజన్ లోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలురా, వర్ని, ఎడపల్లి మండలాలతో పాటు నిజామాబాద్ డివిజన్ లోని నవీపేట్ మండలంలో నామినేషన్లు స్వీకరించారు. 11మండలాల్లో 184 గ్రామ పంచాయితీలు ఉండగా రెండవ రోజు 304నామినేష్లు దాఖలయ్యాయి.

More articles

Latest article