29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉమ్మడి జిల్లాలో ప్రజావాణికి 285 ఫిర్యాదులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ / కామారెడ్డి, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణికి 285 ఫిర్యాదులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ, డీపీఓలకు తమ ఫిర్యాదులను అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

285 complaints to Prajavani in the joint district

More articles

Latest article