- జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, బతుకమ్మ : బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వినూత్నంగా 25 అంబాసిడర్ కార్లను గులాబీ రంగుతో ఆకర్షణీయంగా శేరి లింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రవి యాదవ్ ఏర్పాటు చేశారు. వాహనాల శ్రేణిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి యాదవ్ ఆమె అభినందించారు. టిఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన అంబాసిడర్ కారును గులాబీమయం చేసి.. 25 కార్లతో ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి బయలుదేరాయి. బంజారా హిల్స్ లోని తన నివాసం నుండి 25 వాహనాల శ్రేణిని జెండా ఊపి ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కెసిఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద రవి యాదవ్ చూపిస్తున్న ప్రేమ , ప్రజల ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
