27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

23మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

 హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణాలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ కమిషనర్‌గా సజ్జనార్‌ను, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను,  విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్‌‌ను నియమించింది.  ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.  స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీజీగా విజయ్‌ కుమార్‌, పౌ రసరఫరాల ప్రిన్సిపల్‌ సెక్రటరీగా స్టీఫెన్‌ రవీంద్ర, గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డిజీగా అనిల్ కుమార్‌కు ఇచ్చారు. మల్టీజోన్ 2 ఐజీగా డీఎస్‌ చౌహన్, విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా తఫ్సీర్ ఇక్బాల్, సిద్దిపేట కమిషనర్‌గా ఎస్.ఎమ్ విజయ్ కుమార్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, నారాయణపేట ఎస్పీగా జి. వినీత్, ఎల్బీనగర్ డీసీపీగా బి. అనురాధ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సీహెచ్‌ ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీగా రితు రాజ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా రవి గుప్తాను ప్రభుత్వం నియమించింది.


23 IPS officers transferred

More articles

Latest article