25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రామాలయం 13వ వార్షికోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వసంత పంచమి పురస్కరించుకొని ఏఆర్పీ క్యాంప్ లోని శ్రీరామ్ మందిరం 13వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక అభిషేక కార్యక్రమం, సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలకు కలశ అభిషేకం, మహిళలు కుంకుమ అర్చన, మహా యజ్ఞం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ మహోత్సవంలో సహకరించిన భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ అధ్యక్షులు సారా శ్రీనివాస్ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సారా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తోట రాజశేఖర్, నాయిని బలరాం ,కార్యదర్శి పుల్కా స్వామి, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, ఆలయ వర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

13th Anniversary of Ram Temple

More articles

Latest article