25.5 C
Hyderabad

ఇంటివద్దే సాధారణ ప్రసవం చేసిన 108 సిబ్బంది

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ  :  పురిటినొప్పులు ఎక్కువవడంతో 108 సిబ్బంది ఇంటివద్దనే సాధారణ ప్రసవం చేశారు. అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం., జుక్కల్ మండలం డోన్ గావ్ గ్రామానికి చెందిన అనిత కు పురిటినొప్పులు ఎక్కువవడంతో భర్త హన్మండ్లు 108 అంబులెన్సు సమాచారం ఇవ్వగా,  సిబ్బంది సుశాంత్, శంకర్ వెంటనే గ్రామానికి చేరుకొని సదరు మహిళను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. నొప్పులు ఎక్కువవడంతో ఇంటి వద్దనే సాధారణ ప్రసవం చేశామని, అనిత మగబిడ్డకు జన్మించినట్టు వారు తెలిపారు. వైద్యుడు శివ సలహాతో మెరుగైన వైద్యం కొరకు జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సిబ్బంది తెలిపారు. కాగా అనిత కి సాధారణ ప్రసవం చేసి, తల్లి, బిడ్డను క్షేమంగా ఉండేలా వైద్యం అందించిన సిబ్బందికి మహిళ భర్త హన్మండ్లు ధన్యవాదాలు తెలియజేశారు.

More articles

Latest article