నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోశాలలో ఆవులకు పండ్లు, దాణా పంపిణీ చేశారు. ఆదివారం దాస్ నగర్ లోని లక్ష్మీ నరసింహస్వామి గోశాలలో 30 తట్టలు, 30 డజన్ల అరటి పండ్లు, 50 కిలోల దాణా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా గోశాలలో ఆవులకు పండ్లు, దాణా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రంలో ఫౌండేషన్ సభ్యులు ప్రసాద్, నరోత్తం రెడ్డి, రామ్మోహన్, మధు, పవన్, రాజు, చిట్టిమిల్ల రాజేశ్వర్, రంజిత్ ఫ్యామిలీ, శ్రీకర్,విజయ్ వర్ధన్ తదతరులు పాల్గొన్నారు.
