27.2 C
Hyderabad

  అప్పుడు సర్పంచ్… ఇప్పుడు పంచాయతీ రాజ్ ఎఇ అరెస్ట్

Sarpanch then... Panchayat Raj AE arrested now

Must read

📰 Generate e-Paper Clip

 

 

. . . 15 వ అర్థిక సంఘం నిధుల దుర్వినియోగం కేసులో పంచాయతీ రాజ్ ఎఇ అరెస్ట్

 

. . . కరీం నగర్ లో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలిసులు

 

 కామారెడ్డి, బతుకమ్మ:

 

కామారెడ్డి జిల్లాలో 15 వ అర్ధిక సంఘం నిధుల దుర్వినియోగం సర్పంచ్ ను కట కటాల్లోకి పంపిన విషయం మరువకముందే. ఇదే కేసులో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ను కామారెడ్డ పోలిసులు కరీం నగర్ లో అరెస్ట్ చేసిన ఘటన గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరిధ్ పెట్ గ్రామంలో సర్పంచ్ నర్సింహరెడ్డి అవినీతిపై గ్రామ ఉపసర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు అందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు రూ.4.5 లక్షల 15 వ అర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగాయని పాలక పక్షం సర్పంచ్ పై తిరుగుబాటు చేసి అందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరంలో జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ విచారణకు అదేశించారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన 15 వ అర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనని తెలడంతో పోలిసులు కేసు నమోదు చేసి సర్పంచ్ నర్సింహరెడ్డిని అరెస్ట్ చేసి కామారెడ్డి జైలుకు తరలించారు. 15వ అర్థిక సంఘం నిధులను దుర్వినియోగంలో సర్పంచ్ కు సహకరించిన పంచాయతీ రాజ్ ఎఇ వేంకటేష్ పరారీలో ఉన్నారు.   పోలిసులు అప్పటి నుంచి గాలింపు చర్యలు చెపట్టారు. తాజాగా పోలిసులు కరీం నగర్ లో ఎఇ వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ఎఇని  జైలుకు తరలించారు. కామారెడ్డి జిల్లాలో ఓక్క గ్రామ పంచాయతీలో అవినీతి కారణంగా సర్పంచ్ అరెస్ట్ కాగా అదే కేసులో పంచాయతీ రాజ్ ఎఇ అరెస్ట్ కలకలం రేపింది. వరుస అరెస్ట్ ల పర్వం జిల్లాలో హట్ టాఫిక్ గా మారింది.

Sarpanch then... Panchayat Raj AE arrested now
Sarpanch then… Panchayat Raj AE arrested now

More articles

Latest article