28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రతి పనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శ్రద్ధ వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం పబ్లిక్ హెల్త్ ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.60 కోట్లతో ప్రారంభమైన పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ప్రతి డివిజన్ కు కోటి రూపాయలు కేటాయించారని త్వరలోనే అన్ని డివిజన్లో పనులు ప్రారంభమవుయని తెలిపారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిపై సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే నూతన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ప్రధానంగా నగరంలోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి వరకు రూ.30 కోట్లతో రోడ్డు ప్రతిపాదించామన్నారు అలాగే ఆర్ యూబీ ల నిర్మాణానికి రూ.60 కోట్లు, నాందేవ్ వాడ వంతెన పొడిగింపునకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా అమృత్ 2 కింద మంజూరైన యూజీడీ పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, డీఈ యోగేందర్, ఏఈ శంకర్, యూ జీ డీ ప్రాజెక్ట్ మేనేజర్ జయశంకర్, ఆర్ అండ్ బి అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article