బతుకమ్మ,మోర్తాడ్: చినిగిన చొక్కా వేసుకోన్న పర్వాలేదు. కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదవడం వల్ల జ్ఞానము సంపాదించుకోవచ్చని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య అన్నారు. విద్యార్థి దశ నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బుద్ధుడి దర్శనం అనే పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, కరుణ ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్, ట్రస్ట్ సభ్యులు రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
