ఆపరేషన్ సిందూర్ ను ప్రపంచమంతా కొనియాడింది
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
డిల్లీ, బతుకమ్మ : ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు ఆపరేషన్ సిందూర్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడ్డామని తెలిపారు. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందని ప్రపంచమంతా తెలుసన్నారు. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద పోషకులుగా నిరూపించుకుందన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను ప్రపంచమంతా కొనియాడిందన్నారు. సరిహద్దులను రక్షిస్తున్న జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు.
