26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అంకాపూర్ సొసైటీలో అక్రమాలు జరగలేదు

Must read

📰 Generate e-Paper Clip

  • మార్క్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి

 

ఆర్మూర్, బతుకమ్మ : అంకాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.30 లక్షలు అక్రమాలు జరిగినట్లు కొందరు చేసిన ఆరోపణలు అవాస్తవమని రుజువయ్యాయి. ఆర్మూర్ మండలం అంకాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మార్క్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి అధ్యక్షతన సోమవారం మహాజనసభ జరిగింది. గ్రామానికి చెందిన వినోద్ రెడ్డి అనే వ్యక్తి సొసైటీలో రూ. 30 లక్షల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో మహాజన సభ నిర్వహించి గ్రామంలో పాత గోదాంను గతంలోని డిసిఓ సింహాచలం అనుమతి తీసుకొని ఓపెన్ టెండర్ నిర్వహించి రూ. 30 లక్షలకు విక్రయించినట్లు తెలిపారు. ఈ 30 లక్షలలో 21 లక్షలు మార్క్ ఫెడ్ కు చెల్లించినట్లు వివరించారు. మిగతా 11 లక్షలు రుణం తీసుకొని సొసైటీ భవనం నిర్మించినందున ఋణం చెల్లించామన్నారు. లక్ష రూపాయలు రెనివేషన్ కు ఉపయోగించినట్లు లెక్కలు చెప్పారు. గ్రామ కార్యదర్శి శ్యామ్ చెప్పిన లెక్కలను మహాజన సభలో పాల్గొన్న సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

There were no irregularities in the Ankapur society

More articles

Latest article