బతుకమ్మ:బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని శనివారం మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెంచిన మెనూని విద్యార్థులకు తెలియపరచడంతో పాటు విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించామని ఎంఈఓ తెలియజేశారు. పర్యవేక్షణలో భాగంగా ఉదయం అల్పాహార తయారీని పరిశీలించారు. అలాగే పలు రికార్డులను పరిశీలించి కస్తూర్బా గాంధీ విద్యాలయ ఉపాధ్యాయులందరూ సమ్మెలో ఉన్నందున తరగతులు నిర్వహణ కొనసాగడం లేదని ఆయన తెలియజేశారు.

