30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నిందితులను శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐఎఫ్ టీయూ నిజామాబాద్ నగర కార్యదర్శి ఎం శికుమార్ డిమాండ్ చేశారు. ఐ ఎఫ్ టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు మంగళవారం నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో నిరసన తెలిపారు. చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకొని నేరస్తులు తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో నాయకులు మచ్చ మోహన్, మొగులయ్య, రాజు, వరదయ్య, వీరయ్య, శంకర్, రాజు, గంగాధర్, సోను, అంజయ్య, మల్లేశ్, వసీం, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. 

More articles

Latest article