31.2 C
Hyderabad

బంగారం కొనేవాళ్లలో తెలుగు మహిళలదే తొలి స్థానం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్​,బతుకమ్మ :  అత్యధికంగా బంగారం కొనేవాళ్లలో తెలుగు మహిళలదే తొలి స్థానమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో గురువారం మలబార్ గోల్డ్ షాపింగ్ మాల్ ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశంలోనే ఓ వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా మహేశ్వరం ప్రాంతంలో నాలుగో నగరాన్ని నిర్మించే ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు. గతంలో కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు, వైఎస్ఆర్ సైబరాబాద్ ను నిర్మించారన్నారు. మా ప్రభుత్వం నాలుగో నగరాన్ని నిర్మించి, భారత్ కు ఫ్యూచర్ సిటీని అందించనుందన్నారు.

More articles

Latest article