25.5 C
Hyderabad

స్నేహ సొసైటీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Teachers' Day celebrations held grandly at Sneha Society

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్  దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలను నృత్యాలు పాడిన పాటలను తిలకించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, స్నేహ సొసైటీలో ఉపాధ్యాయ విధులు నిర్వర్తిస్తున్న వారిని శాలువలు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ దివ్యాంగ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ పూర్తిస్థాయిలో తెలియని దివ్యాంగ విద్యార్థులకు చదువు చెప్పడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన స్నేహ సొసైటీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మొదట ఇక్కడి మానసిక, అంద దివ్యాంగ విద్యార్థులను చూసినప్పుడు ఎలా తట్టుకోగలను వీరికి ఏ విధంగా చదువు చెప్పగలను అనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా పాఠశాల ప్రిన్సిపాల్, నిర్వాహకుల ప్రోత్సాహంతో చెప్తూ ముందుకు సాగడం సంతోషకర మన్నారు. అలాగే ఆయా ప్రభుత్వ పాఠశాలల నుండి విచ్చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా బాగుండి ఆర్థిక పరంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్ని ఉన్నప్పటికీ కూడాను సాధారణ  విద్యార్థులను ఏ విధంగా చదువుతోపాటు క్రమశిక్షణ నేర్పేందుకు ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అలాంటిది స్నేహ సోసైటీలో ఉన్న దివ్యాంగ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో, చదువుతోపాటు పాటలు పాడడం, నృత్యాలు చేయడం, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. భగవంతుడు శరీరానికి లోపం ఇచ్చి ఉండొచ్చు గాని వారిలో మేధోసంపత్తి అనేది చాలా దాగి ఉందని స్పష్టం చేశారు. అలాంటి మేధో సంపత్తిని స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బంది వెలికి తీసి వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రోత్సాహం అందించడం గొప్ప విషయమన్నారు.

Teachers' Day celebrations held grandly at Sneha Society.

ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రుల తర్వాత గురువులదే బాధ్యత అని,  ప్రతి గురువు గురుతర బాధ్యతల నేపద్యంలో ఎల్లప్పుడూ విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటుపడతారన్నారు.. తల్లిదండ్రులు,గురువులకు సహకరించినప్పుడు విద్యార్థులు క్రమశిక్షణతో మరియు విద్యలో సామాజిక రంగంలో ముందంజలో ఉంటారని వారు స్పష్టం చేశారు.. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను,  స్నేహ సొసైటీ ఉపాధ్యాయులను స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతిలను ఘనంగా శాలువలతో సన్మానించారు. అలాగే దివ్యంగా మానసిక విద్యార్థులు తమ గురువైన స్నేహ సొసైటీ కార్యదర్శిని, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటంతో ఘనంగా సన్మానించారు.

 

 Teachers' Day celebrations held grandly at Sneha Society.

 

More articles

Latest article