హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనములు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు, రోడ్ల రెన్యువల్ పనులు మొత్తంగా 250 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆయనకు అందించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్న పుష్కర ఘాట్ లకు రోడ్లను రెన్యువల్ చేసి భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రతిపాదిత పనులను పరిశీలించి మంజూరు కొరకు సంబంధిత శాఖ వారికి పంపడం జరిగిందన్నారు.
