29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

శంకర్ భవన్ లో సమ్మర్ క్యాంప్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో శనివారం నుంచి సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. విద్యార్థులకు 15 రోజులపాటు డ్యాన్స్, డ్రాయింగ్, యోగా అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. సమ్మర్ క్యాంప్ ను ఎంఈవో సాయారెడ్డి, హెచ్ఎం మల్కేశం, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు సోడి కృపాల్ సింగ్, డీసీఈబీ కార్యదర్శి సీతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ ను ఏర్పాటు చేయించిన డీఈవోకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. విద్యార్థులకు స్నాక్స్ తోపాటు తాగునీరు అందిస్తామని ఎంఈవో సాయారెడ్డి అన్నారు.

Summer camp at Shankar Bhavan

More articles

Latest article