27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశం పొంది ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మరియు ఐటిఐ కళాశాలల ప్రిన్సిపాల్  ప్రభుత్వం  నూతనంగా ఏర్పాటు చేసిన  అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో అడ్మిషన్ల పెంపు పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంప్రదాయ ఐటిఐ ట్రేడ్స్ తో పాటు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీలోని నైపుణ్య ఆధారిత కోర్సులలో అడ్మిషన్లు  అందుబాటులో ఉన్నాయని ఆయా కోర్సుల ద్వారా యువత  త్వరగా ఉపాధిని మరియు ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం అత్యధికంగా ఉన్నందున జిల్లాలోని అధిక మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో  చేరేలా విశృత ప్రచారం కల్పించాలని అన్నారు. గ్రామస్థాయిలలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా  గ్రామస్థాయి అధికారుల సహకారంతో  విద్యార్థులకు ఏటిసి కేదార్ల గురించి తెలియజేసి  వాటిలో చేరేలా ప్రోత్సహించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ శాఖా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటిఐ/ ఆడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్ బిచ్కుంద, తాడ్వాయి మరియు ఎల్లారెడ్డి లో ని ఆడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్ లలో వాక్ ఇన్ అడ్మిషన్ల ప్రారంభమాయ్యాయని  విద్యార్థులు తేదీ: 06-08-2025 నుండి 28-08-2025 వరకు  ప్రతిరోజూ ఉదయం 11:00 గం. ల నుండి మధ్యాహ్నం 01:00 వరకు మీ యొక్క ఒరిజినల్ పత్రాలతో ఆయా ఐటిఐ. / ఏటిసిలకు హాజరై సిటు పొందగలరని అన్నారు. 10 వ తరగతి ఉతీర్ణత కల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, సoప్రదాయ ఐటిఐ ట్రేడ్స్  తో పాటు ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఆడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్స్ (A.T.C.,) లోని “ నైపుణ్యధారిత కోర్సులలో”  అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి.  వర్చ్యువల్ ఎనాలిసిస్ అండ్ దిసిజ్ఞేర్,  సి యాన్  సి మేశినింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నిశియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మనుఫచ్తురింగ్ టెక్నిశియన్,  మనుఫచ్తురింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నిశియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన డాక్యూమెంట్లతో  (ఎస్. ఎస్. సి. సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్, ఫోటోలు మరియు మరియు నాలుగు సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకోని సంబంధిత ఐటిఐలకు నేరుగా హాజరు అయ్యి అడ్మిషన్ పొందవచ్చని అన్నారు. ఈ మీటింగులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్  సీహెచ్. ప్రభుదాస్,  ప్రిన్సిపల్ కన్వీనర్ G ప్రమోద్  తాడ్వాయి ప్రిన్సిపల్ ఎఫ్ఏసీ జి కనకయ్య, హాజరయ్యారు.

Students should build a bright future

More articles

Latest article