హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ గా 1994 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ శివధర్ రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. డీజీపీ జితేందర్ ఈ నెల 30న రిటైర్ కానున్న నేపథ్యంలో ఆయన స్థానంలో శివదర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
