29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఈద్గాలను సందర్శించిన షబ్బీర్ అలీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని పలు ఈద్గాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం సందర్శించారు. రంజాన్ పండుగ వస్తున్న సందర్భంగా ఈద్గాల వద్ద వసతులను, అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పట్టణంలోని జదీద్ ఈద్గా, మదీనా ఈద్గా, ఐలే హదీస్ ఈద్గా, లను సందర్శించినట్లు తెలిపారు. మదినా ఈద్గా అభివృద్ధికి బోర్ మోటర్ అక్కడి స్థలాన్ని చదును చేయడానికి 300 ట్రిప్పుల మొరం వేయించడానికి సూచించినట్లు తెలిపారు. పండుగ రోజు తాగునీరు,  అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏలాంటి అవకతవకలు జరగకుండా పనులన్నీ సమయానికి సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

Shabbir Ali visits Eidgahs

More articles

Latest article