డోంగ్లి, బతుకమ్మ : డోంగ్లి మండలం నూతన రెవిన్యూ అధికారిగా గురువారం సాయిబాబా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు నిజాంసాగర్ ఆర్ఐగా విధులు నిర్వహించి డోంగ్లి మండలం కు బదిలీ అయినట్లు సాయిబాబా తెలిపారు. డోంగ్లి మండలంలో ఇంతకుముందు విధులు నిర్వహించిన వెంకటస్వామి నసురుల్లాబాద్ మండలానికి బదిలీపై వెళ్లారు.